
భారతదేశంలో ధనుర్మాసంలో పెళ్ళికాని పడుచులు, తమకు మంచి భర్తని ప్రసాదించమని గోదా దేవి ( ఆండాళ్ ) ని వేడుకుంటూ, పాటలు పాడే ఒక సాంప్రదాయం ఉంది, దీనినే కాత్యాయినీ వ్రతం అంటారు. ఆ కోవకు చెందినదే తిరుప్పావై వ్రతం, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని భర్తగా కోరుకుంటూ గోపికా స్త్రీలు ఇదే వ్రతాన్ని ఆచరించారన్నది ఆండాళ్ నమ్మిక. శ్రీ వైష్ణవులు ఏడాది పొడుగునా, ప్రతిదినం తమ యిళ్ళలో, దేవాలయాల్లో విధిగా ఈ పాశురాలను పఠిస్తారు. కాని ధనుర్మాసంలో పాడే ఈ పాటలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక్కొక్క పాశురం ఒక్కొక్క రోజు గానం చేయబడుతుంది. తిరుప్పావై, ధనుర్మాసంలో శ్రీ వైష్ణవులు ఆచరించవలసిన కొన్ని వైష్ణవ ధర్మ నియమాలను నిర్దేశిస్తుంది. దేశమంతటా శ్రీ వైష్ణవులు భగవత్కృప, శాంతిసౌఖ్యాలను కోరుకుంటూ, వీటిని గానం చేస్తారు. ఆండాళ్ తన చెలులతో కలిసి, శ్రీకృష్ణుడిని భర్తగా పొందడానికై తిరుప్పావైని గానం చేస్తూ, ముప్ఫై రోజులు కఠిన వ్రతమాచరిస్తుంది. సూర్యుడు ధనుః రాశిలో ప్రవేశించి ఉంటాడు. ఆంగ్ల మానం ప్రకారం డిసెంబరు 16 నుండి మొదలై సంక్రాంతి వరకు. ఈ మాసం మనకు జ్ఞానం ఇచ్చే మాసం. వ్రతం చేయటం కష్టం కాదా? కాదు, ఇది అతి సులభమైనది. తెలతెల వారే సమయంలో స్నానం చేయ్యటం, ఆరోజు పాశురం చదివి, ఆపై శ్రీకృష్ణుడికి పొంగలి ఆరగింపు చేయటం. ఇక ఆయా పాశురాల అర్థం వినడం అంతే. శరీరాన్ని కష్టపెట్టే వ్రతం కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీకృష్ణుని కళ్యాణ గుణాలతో స్నానం చేయటమే ఈ వ్రతం.
Page Count:
105
Publication Date:
2022-10-19
Publisher:
Independently published
ISBN-13:
9798359023405
No comments yet. Be the first to share your thoughts!