
కథాసాహిత్యంలో మరో కథా సంచిక హృదయగీతికలు కథలన్నీ గుండె లోతుల్లో నుండి ఎగసిపడిన కెరటాలు. హృదయ కవాటాలు తెరచుకొని లోకాన్ని రసమయ జగతికి రాకేందు కిరణాలుగా ప్రసరింపజేస్తున్న అనుభవ జీవిత సత్యాలు. ఎనిమిది కథలు అష్టదిక్కులకు సంకేతాలుగా ప్రసరిస్తున్న లేలేత ఉషోరేఖలు. ఒక కథ ప్రేమ మూట. ఇందులోని మాటల మూటలు గుండెలోతుల్లోకి చొరబడి కర్తవ్య బోధ చేస్తున్న ఆత్మబోధ, అమ్మగాధ, మానసిక వ్యధ మరచిపోలేని ఘటన. ఐదో దిక్కు ఒక అద్భుత ఇతి వృత్తం. జీవన పోరాటంలో గమ్యాన్ని వెతుక్కునే మార్గం. రెండు కులాల మధ్య జరిగిన జీవన ఘర్షణ -సంస్తృతి, సంప్రదాయాల్లోని మమతను అంతర్లీన ప్రేమను, భావుకతను వెలికితీసి కృషి పట్టిన సామాజిక ఉత్పాదక చక్ర భ్రమణం. ప్రస్తుత యువ సమాజాన్ని సమగ్రంగా కధీకరించిన ఇతివృత్తం ఆకాశమంత. సంసార సాగరాన్ని ఈదేవాడు ఎవరు అన్న ప్రశ్న తరతరాలుగా ప్రశ్నగానే మిగిలిపోయింది. ఆకాశమంత కథలో మంచి సందేశముంది. సన్నివేశ పూర్వకంగా రచన చేసిన విధానం బాగుంది. కథ చదువు సేపూ రఘుపాత్రలోనేనున్నాన్నా అనే ప్రశ్న జనించక మానదు. అంత అద్భుతంగా రచయిత పాత్రను మలిచిన తీరు బాగుంది. సమస్య దాని పరిస్కారం చక్కగా చూపాడు. కథలన్నీ యిలాగే నడిచాయి. మధ్యలో సునిసిత హాస్యం, ఉత్కంఠ, ఆశ్చర్యం, అద్భుతం అన్ని రంగరించిన కథా సంపుటియిది. ప్రతి కథనూ విశ్లేషిస్తే మరో థీసిస్ అవుతుంది. నూతలపాటి నాగేశ్వరరావుగారు అవిశ్రాంతంగా సాహితీ సృజన చేస్తున్న సత్య సాహిత్య శీలి, పది మందికి మార్గదర్శకంగా నిలిచిన సన్మార్గ జీవన సాహితీ సౌజన్య మూర్తిప్రతి కథలోనూ ఇతి వృత్త స్వీకారం, కథాగమన సంవిధానం చతురత బాగుంది.
Page Count:
203
Publication Date:
1900-01-01
Publisher:
Instant Publication
ISBN-10:
9391176453
ISBN-13:
9789391176457
No comments yet. Be the first to share your thoughts!